పేదల ఇంటి పట్టాలకు గ్రహణం

–మహనేత వైయస్‌ హయంలో భూములు కోనుగోలు
–పట్టాలు ఇవ్వడంలో బాబు సర్కార్  తీవ్ర నిర్లక్ష్యం

ఉరవకొండ: ‘‘2008 లో మహనేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉరవకొండ పట్టణంలోని అర్హులైన నిరుపేదలకు ఇంటి పట్టాలు అందించాలన్న లక్ష్యంతో సుమారు 88 ఎకరాల విలువైన స్థలాన్ని రూ. కోటి వెచ్చించి కోనగోలు చేశారు. అయితే ఈ భూమిని పేదలకు పట్టాలు మంజురు చేసి ఇవ్వడంలో అధికార పార్టీ నేతలు అడ్డుపడుతూ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ’’

ప్రతి సామాన్యుడికి ఉండే ఓ కల....సొంత ఇల్లు నిర్మించుకోవడం చేతనైనంతలో సొంతింటిని నిర్మించుకొని, ఉన్నంతలో జీవించాలని అనుకుంటారు. తమ కలను సాకారం చేసుకోవడానికి తగిన ఆర్థిక స్థోమత లేక నానా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా ఉరవకొండ పట్టణంలోని పేదల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మహనేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పేదలకు ఇంటి పట్టాలు అందించాలని భూమి కోనగోలు చేసినా వాటిని పంచి పెట్టడంలో అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఏళ్ల తరబడి నీరిక్షణే:
ఉరవకొండ పట్టణంలో 45వేల జనాభా 20 వార్డులు, 8వేల నివాస గృహలు ఉన్నాయి. వీరిలో చాలమంది పేద, మధ్య తరగతి ప్రజలు అద్దె ఇంట్లో నివసిస్తూ అవస్థలు పడుతున్నారు. ఇందులో దినసరి కూలీలుగా పనిచేసే వారే అధికంగా వున్నారు. వీరు ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఒక్కరు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి స్వార్థం కారణంగా అర్హులైన కూడ వారికి పట్టాలు మాత్రం ఇవ్వడం లేదు.

పేదల ఇంటి పట్టాల కోసం ఎమ్మెల్యే సుదీర్ఘ పోరాటాం:
ఉరవకొండ పట్టణంలోని అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు అందించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి చేసిన ధర్నాలు, దీక్షలు పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో ఉంటూ 24, 34 గంటల దీక్షలు, పేదలతో కలిసి మహా ధర్నాలు ప్రభుత్వానికి కనువిప్పు కల్గించే ప్రయత్నం చేశారు.

పేదలకు పట్టాలు ఇచ్చే వరుకు పోరాటం ఆగదు:విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యే
ఉరవకొండ పట్టణంలోని అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చే వరుకు తమ పోరాటం ఆగదు. మహనేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పేదలకు పట్టాలు ఇవ్వాలని కోనగోలు చేసిన భూమిని పంచి పెట్టడంలో కొందరు అధికార పార్టీ నేతల స్వార్థం వుంది. పేదలకు పట్టాలు ఇచ్చే వరుకు ఆందోళన ఆగదు, త్వరలో మరో భారీ ఉద్యమం చేపడుతామని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.
Back to Top