ప్లీనరీ సమావేశ తీర్మానాలు

కోవూరు: 1. కోవూరు చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి. చక్కెర కర్మాగార జీతభత్యాలు , బకాయిలు వెంటనే చెల్లించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి.
2. నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీ పనులను సత్వరం పూర్తి చేసి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించి ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. 
3. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ లకు పెట్టిన విధంగానే బీసీలకు సబ్‌ప్లాన్‌ పెట్టి గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు చేసిన వాగ్థానం ప్రకారం 10వేల కోట్ల రూపాయల నిధిని కేటాయించి రాష్ట్రంలోని బీసీలను ఆదుకోవాలి.
4. రాష్ట్రంలోని బీసీలకు అన్యాయం జరగకుండా గత ఎన్నికల్లో చేసిన వాగ్థానం ప్రకారం ఈ రాష్ట్రంలోని కాపులకు రిజర్వేషన్‌ కల్పించాలి. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు కాపు కార్పోరేషన్‌కు నిధులు విడుదల చేసి కాపులను ఆర్థికంగా ఆదుకోవాలి.
5. రాష్ట్రంలోని మైనార్టీలకు అర్హులందరికీ సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల మేరకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య హామీ అమలుచేయాలి. ముస్లిం మైనార్టీ నిరుద్యోగ యువతలకు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటుచేసుకోవడానికి రూ.5లక్షల వరకు షూరిటీ లేని రుణాన్ని ఇస్తానన్న చంద్రబాబు హామీని తక్షణమే అమలుచేయాలి.
6. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని దళితులకు భూమి కొనుగోలు పథకాన్ని అమలుచేయాలి. జిల్లాలోని ఎస్టీ కార్పోరేషన్ల ద్వారా అర్హులైన దళితులందరికీ రుణం మంజూరు పథకం అమలుచేసి అందుకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేసి నిరుద్యోగ దళిత యువతీ, యువకులను ఆదుకోవాలి.
7. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎస్టీలకు పెట్టిన సబ్‌ ప్లాన్‌ నిధులు మంజూరు పథకాన్ని తెలుగుతమ్ముళ్ళ జేబులు నింపే పథకంలా మార్చకుండా ఎస్టీ కాలనీలో ఉన్న నిరుద్యోగ యువతకు కేటాయించి ఆయా పనులను వారిచే అమలు జరపబడేలా ఆయా ఎస్టీ కాలనీలోని యువతకు ఉపాధి కల్పించాలి.
8.ఎన్నికల్లో ఇచ్చిన వాగ్థానం మేరకు ఈ ప్రభుత్వం గిరిజనులకు భూమి కొనుగోలు పథకం హామీని సత్వరమే అమలుచేయాలి. గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ ఫించను మంజూరుచేయాలి. గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు షూరిటీ లేని రుణాలను ఇస్తానన్న ఎన్నికల హామీని ఈ ప్రభుత్వం బేషరత్తుగా అర్హులందరికీ అమలుచేయాలి.
9. తడ నుంచి ఇచ్చాపురం వరకు తీరప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకార కుటుంబాలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇల్లు లేని మత్స్యకార కుటుంబానికి రూ.5లక్షలతో పటిష్టంగా పక్కా ఇల్లు నిర్మించాలి. తుఫాను ,సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పడు మత్స్యకారులకు ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.
10. సునామీలు సంభవించినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఒక కమిటీని వేసి 1700 వందల కోట్ల రూపాయలకు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఆయన మరణానంతరం రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం 1700 వందల కోట్ల విడుదల చేయడం జరిగింది. ఆ మహానేత ముందుకు చూపుతో ప్రతిపాదనను ముందుగా పంపబట్టి ఆ నాటి యూపీఏ ప్రభుత్వం నిధులుమంజూరు చేయడం జరిగింది. వాటి ఫలితాన్నే మన రాష్ట్రంలోని తీరప్రాంత గ్రామాలన్నీ పక్కా రోడ్లు, వంతెనలు నిర్మించి తుఫాను క్షేత్ర బిల్డింగులతో కళకళాలాడుతున్నాయి. మత్స్యకారుల హృదయాల్లో ఒక దేవుడిగా వైయస్‌రాజశేఖర్‌రెడ్డి కొలువై ఉన్నాడు. అందులో భాగంగానే ఆ మహానేతకు నివాళులర్పించడం జరిగింది.
11. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్థానాల మేరకు డ్వాక్రా మహిళల రుణమాఫీని సంపూర్ణంగా అమలుచేయాలి. రాష్ట్ర మహిళలపై జరుగుతున్న అరాచకాలను, లైగింగదాడులను అరికట్టాలి.
12. రాష్ట్రంలోని మహిళా అధికారులపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు , నాయకులు , కార్యకర్తలు చేస్తున్న దాడులు , రౌడీలను ఖండించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నాము.
13. అంగన్‌వాడీ కార్యకర్తలు , ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించి వారిని ఆదుకోవాలి. మహిళల భధ్రతకై అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక మహిళా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుచేసి ఎన్నికల హామీని వెంటనే అమలుచేయాలి.
14. చేనేత కార్మికుల రుణమాపీని పూర్తిగా అమలుచేయాలి. ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి పక్కా గృహం నిర్మించాలి. శాశ్వత ప్రతిపాదికన చేనేత కార్మికులను ఆదుకోవాలి. స్టాండ్‌ మగ్గాలను అవసరమైన ప్రతి ఒక్కరికి సబ్సిడీ మంజూరుచేయాలి.
15. నియోజకవర్గంలోని ముదివర్తి పాళెం –ముదివర్తి మధ్య పెన్నానదిపై చెకిడ్యాం నిర్మిస్తామని ఇచ్చిన హామీని అమలుచేయాలి. ఈ చెక్‌ డ్యాం వలన ఇందుకూరుపేట – విడవలూరు మండలాలు కలిసిపోయి 45 గ్రామాలకు లబ్దిచేకూరుతుంది. కొడవలూరు మండలంలోని ఇఫ్‌కో సెజ్‌కు కేటాయించిన భూములకు చెందిన రైతులకు పరిహారం పూర్తిగా చెల్లించకపోగా అందులో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న వ్యవసాయేతర పరిశ్రమలకు అధిక ధరలకు భూములు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ , స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
16. జిల్లాలోని ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో జరిగిన, జరుగుతున్న ఇరిగేషన్‌ పంచాయతీరాజ్‌ నీరు చెట్టు , ఆర్‌అండ్‌డి పథకాల్లోని అవినీతి అక్రమాలపై ప్రభుత్వం సత్వర విచారణ చేపట్టాలి. అవినీతిపనులను నిగ్గుతేల్చాలి. అంగన్‌వాడీ నియమాకాల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి. స్థానిక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కొడవలూరు మండలం, బొడ్డువారిపాళెం గ్రామంలోని 21 ఎకరాల ప్రభుత్వ భూమిని తన తండ్రి, అక్క పేర్లతో మార్చుకొని పాసుపుస్తకాలు తీసుకొన్న నిర్వాహాకాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్ళిన ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపైన జిల్లా కలెక్టర్‌ సత్వర చర్యలు చేపట్టి పాసుపుస్తకాలు రద్దుచేసి ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు ఇవ్వాలని ప్లీనరీ సమావేశంలో తీర్మానించి ఆమోదించడం జరిగింది.

తాజా ఫోటోలు

Back to Top