నిరుపేద కోటీశ్వ‌రులు

 

మొన్న‌టిదాకా చంద్ర‌బాబుకు చేతికి వాచీ, వేలికి ఉంగ‌ర‌మే లేద‌నుకున్నాం. తాజాగా వారి ఆస్తుల జాబితా చూసాక‌, నారా లోకేష్ వాస్త‌వాల‌ను చెప్పాక ప్ర‌జ‌ల క‌ళ్లు పూర్తిగా తెరుచుకున్నాయి.వాచీ ఉంగ‌రం లేని వారికి ఖ‌రీదైన కారు మాత్రం ఉంటుందా? ఉండ‌దుగాక ఉండ‌దు. డొక్కు అంబాసిడ‌ర్ త‌ప్ప చంద్ర‌బాబుకు క‌నీసం బెంజికారు కూడాలేదు. ఆస్తులను మించి అప్పుల‌తో స‌త‌మ‌తం అవుతున్న చంద్ర‌బాబు గురించి ఎంత వింటే అంత క‌రుణ పొంగి పొర‌లాలి. 
నారా అది నోరా...

నారా అది నోరా అంటున్నారు చంద్ర‌బాబు, నారాలోకేష్ ల మాట‌లు వింటున్నవారు. పట్ట‌ప‌గ‌లు ఇన్ని ప‌చ్చి అబ‌ద్ధాలా అని నోరు నొక్కుకుంటున్నారు. త‌న తండ్రికి క‌నీసం ఖ‌రీదైన కారు కూడా లేద‌ని, అన్నీ అప్పులే అని అంటున్నాడు నారా లోకేష్. బాబుగారి ఆస్తి 3 కోట్లు మాత్ర‌మే అని విని ఎంత మంది మూర్ఛ‌పోయారో. దీనికంటే నారా ఫ్యామిలీ త‌మ ఆస్తులను ప్ర‌క‌టించం అని చెప్పినా ఇంత గొడ‌వ ఉండేది కాదు. వంద కోట్ల విలువైన భ‌వంతి నాన్నా కొడుకుల ఇద్ద‌రి పేరా ఉంటే అది ఆస్తుల లెక్క‌లోకి రాకుండా ఎక్క‌డికి పోయింది అని ప్ర‌శ్నిస్తున్నారు. సింగ‌పూరు హోట‌ళ్లు ఆస్తులు కావా అని మ‌రికొంద‌రు ఆగ్ర‌హిస్తున్నారు. అక్ర‌మ సంపాద‌న‌ను బినామీల పేరుతో కూడ‌బెట్టిన చంద్ర‌బాబు ఏటా ఆస్తుల ప్ర‌క‌ట‌న అంటూ ప్ర‌జ‌ల‌ను వెర్రివాళ్ల‌ను చేయ‌డం చంద్ర‌బాబు అహంకారానికి నిద‌ర్శ‌నం అంటున్నారు.  
స‌ర్వేల్లో బాబు భాగోతం
నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ అప్లైడ్ ఎక‌న‌మిక్స్ స‌ర్వేలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అవినీతిలో నెంబ‌ర్ వ‌న్ గా ఉంద‌ని వెల్ల‌డైంది. 
అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రీఫార్మ్ సైతం బాబు ఆస్తుల విలువ‌ను ప్ర‌క‌టించింది. దేశంలోనే అత్యంత సంప‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే అని ఈ సంస్థ స‌ర్వేలో తెలియ‌జేసింది. ఇవేకాదు అనేక జాతీయ అంత‌ర్జాతీయ స‌ర్వేల్లో చంద్ర‌బాబు అవినీతి గురించి, వేల కోట్ల ఆస్తుల గురించిన స‌ర్వేలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష పార్టీ చంద్ర‌బాబు అవినీతిపై అవినీతి చ‌క్ర‌వ‌ర్తి పేరుతో ఓ పుస్త‌కాన్నే ప్ర‌చురించింది. గతంలో వామ‌ప‌క్షాలు కూడా బాబు పాల‌న‌లోని అక్ర‌మాలు, బాబు అక్ర‌మ ఆస్తుల‌పై పుస్త‌కం ప్ర‌చురించారు. ఓ ముఖ్య‌మంత్రి ఆస్తుల‌పై ఇంత పెద్ద ఎత్తున ప‌రిశోధ‌న‌లు, స‌ర్వేలు జ‌రిగడం ఒక్క చంద్ర‌బాబు విషయంలోనే జ‌రిగింది.
వెర్రివాళ్ల‌నుకుంటున్నారా?
ప‌ప్పు ఎవ‌రో రాష్ట్ర‌మంత‌టికీ తెలుస‌ని, ప్ర‌జ‌లు ప‌ప్పులు వెర్రి వెంగ‌ళ‌ప్ప‌లు కార‌ని నెటిజ‌న్లు నారా లోకేష్ ని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా నారా వారి కుటుంబం ప్ర‌క‌టిస్తున్న ఆస్తులు అన్నీ అబ‌ద్ధాల‌ని, ఒక్క‌సారి కూడా వాస్త‌వాల‌ను ప్ర‌క‌టించ‌లేద‌ని అంటున్నారు. దేశంలో ప‌న్ను చెల్లింపుల్లో అత్యంత ప‌ర్ ఫెక్ట్ గా ఉన్న‌ది ప్ర‌తిప‌క్ష నేత‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అయితే, ముఖ్య‌మంత్రి పీఠంలో ఉండి సొంత కంపెనీల‌కు ఎన్నో రాయితీలిచ్చి అధికార దుర్వినియోగం చేసింది చంద్ర‌బాబు. చంద్ర‌బాబు ఆస్తుల గురించి చెప్ప‌డం అంటే కొండ గుల‌కరాయి గురించి చెప్పిన‌ట్టుంది అంటున్నారు. నోటికొచ్చిన అబ‌ద్ధాలు చెబితే న‌మ్మ‌డానికి తెలుగు ప్ర‌జ‌లు చెవిలో ప‌చ్చపూలు పెట్టుకోలేదంటున్నారు. నిజాయితీ నిప్పు అంటూ చెప్పుకునే బాబు అక్ర‌మార్జ‌న గురించి తెలియ‌జెప్ప‌డానికి ఓటుకునోటు కేసు ఒక‌టి చాలు అంటున్నారు.
జాతీయ పార్టీ అభ్య‌ర్థుల‌కే ఫండ్ ఇస్తూ
కాంగ్రెస్ తో క‌లిసి పొత్తు పెట్టుకుని, స్థానాలు పంచుకుని తెలంగాణాలో పోటీ చేస్తున్న చంద్ర‌బాబు, కాంగ్రెస్ అభ్య‌ర్థుల ఎన్నిక‌ల ప్ర‌చారానికి పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఎన్నివేల కోట్లు ఉండ‌క‌పోతే ఓ జాతీయ పార్టీ అభ్య‌ర్థుల‌కు ఓ ప్రాంతీయ పార్టీ అధ్య‌క్షుడు అంత ఇవ్వ‌గ‌ల‌డు అంటున్నారు విశ్లేష‌కులు. ఒక్క ఎమ్మెల్సీ ఓటు కోసం 5 కోట్లు ఇవ్వ‌జూపిన చంద్ర‌బాబు ఆస్తులు 3 కోట్లు అంటే ఎవ్వ‌రైనా న‌మ్ముతార అని ప్ర‌శ్నిస్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేల‌ను కొన‌డానికి కోట్ల రూపాయిలు వెచ్చించిన చంద్ర‌బాబు ఆస్తులు 3 కోట్లు అంటే, అంబాసిడ‌ర్ త‌ప్ప ఏమీ లేదంటే న‌మ్మే పిచ్చివాళ్లెవ‌రూ లేర‌ని ఘాటుగా వాఖ్యానిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు. హైద‌రాబాద్ హైటెక్స్ స‌మీపంలో ప‌దుల ఎక‌రాలు నారాలోకేష్ పేర ఉండ‌గా నారా కుటుంబం 3 కోట్లు మాత్ర‌మే ఆస్తి అని ప్ర‌క‌టించ‌డానికి సిగ్గులేదా అంటున్నారు నెటిజ‌న్లు.
బాబు అవినీతి గురించి అప్పుడే పుట్టిన బిడ్డ‌కు కూడా తెలుసు. ఆస్తుల ప్ర‌క‌ట‌న పేరుతో అబద్ధాలు చెప్పి మా ఆగ్ర‌హాన్నిపెంచ‌డం ఎందుకు బాబూ అంటున్నారు ఎపి ప్ర‌జ‌లు. 
Back to Top