జన సంతకం.. జగన్నామ స్మరణం

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జగన్ కోసం జనం కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభించింది. నాంపల్లిలోని దర్గా యూసుఫియన్ వద్ద పార్టీ సెంట్ర ల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు మతీన్ ముజద్దదీ ఆధ్వర్యంలో సంతకాల సేకరించారు. పార్టీ అధ్యక్షుడు, ఎమ్ పీ శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిని అక్రమంగా జైలులో నిర్భందించిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణపై ముస్లిం మైనార్టీలు మంచి ఆదరణ చూపించారన్నారు. జగనన్న బయటకు రావాలంటూ వందలాది మంది ముస్లిం మైనార్టీలు సంతకాలు చేశారు. జగన్ నిర్ధోషిగా బయటకు వస్తారని దీమా వ్యక్తం చేశారు.  రాజకీయంగా జగన్‌ను ఎదుర్కొలేకనే కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్ని జైలులో నిర్బంధించారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీలకు రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రెండింటికి ధరావతులు దక్కవని తెలిపారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సీఎం అవుతారని యూసుఫియన్ దర్గా ముత్తవల్లీ ఫైసల్ అలీషా ఆశీర్వదించారు. దర్గా యూసుఫియన్ వద్ద  చేపట్టిన సంతకాల సేకరణలో దర్గా మత పెద్ద ఫై సల్ అలీ షా పాల్గొని మొదటగా సంతకం చేశారు. కోఠిలోని మహిళల కళాశాల చౌరస్తా వద్ద కూడా సంతకాల సేకరణ సాగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నగర కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్ హాజరయ్యారు. జగనన్న కోసం జనాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు పెడుతున్నారన్నారన్నారు.

కుత్బుల్లాపూర్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిపై కక్షసాధింపునూ,  జరుగుతున్న అన్యాయాన్నీ నిరసిస్తూ చేపట్టిన ‘కోటి సంతకాలు’ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటున్నారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ బి. జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ గ్రామంలో కూన దయానంద్‌గౌడ్ ఆధ్వర్యంలో  కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొలన్ శ్రీనివాస్‌రెడ్డి, యూత్ కన్వీనర్ సురేశ్‌రెడ్డి, మండల కన్వీనర్ నరేందర్‌రెడ్డి, సేవాదళ్ మండల కన్వీనర్ ధన్‌రాజ్ యాదవ్, డివిజన్ కన్వీనర్లు కాట్రెడ్డి రమణారెడ్డి, కొట్టె శంకర్, శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ:
శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి విడుదల కోరుతూ కృష్ణా జిల్లా కొండపల్లి రైల్వేస్టేషన్ సెంటర్‌లో పార్టీ నేతలు సంతకాల సేకరణ చేపట్టారు. పార్టీ గ్రామ కన్వీనర్ పోరంకి శ్రీనివాసరాజు ఆధ్వర్యం వహించారు.  ప్రయాణికులు, వ్యవసాయ కూలీలు, గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. మహిళా స్టీరింగ్ కమిటీ మహిళా సభ్యురాలు చెరుకు బిజిలి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎ.దుర్గాప్రసాద్, అల్తాఫ్‌రాజ, మండల అధికార ప్రతినిధి శ్రీనివాసరెడ్డి, ఎస్టీసెల్ మండల కన్వీనర్ మొగిలి నాగరాజు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఏడుకొండలు పాల్గొన్నారు. థర్మల్‌ పవర్ స్టేషన్ గేట్ వద్ద ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు నుంచి సంతకాలు సేకరించారు.

జూపూడి(ఇబ్రహీంపట్నం రూరల్)లో...శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి విడుదల కోరుతూ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వేజండ్ల శివశంకరరావు ప్రారంభించారు. స్థానిక నిమ్రా ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో సంతకాలు చేయించారు. పార్టీ మండల కన్వీనర్ అంకమోహనరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేడపాటి నాగిరెడ్డి, గ్రామ పార్టీ కన్వీనర్ కన్నెగంటి వెంకటరత్నం, విద్యార్థులు, యువజన నాయకులు సుధీర్‌రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.

రెడ్డిగూడెంలో...రాఘవాపురంలో యువజన విభాగం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కుప్పిరెడ్డి ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరించారు. రెడ్డిగూడెం కన్వీనర్ చాట్ల రాబర్ట్, చీపు కృష్ణ, బి. కృష్ణారెడ్డి, కందుల హరి, తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top