ఇది నామా క్విడ్‌ప్రోకో

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో సూత్రంతో లబ్ధి పొందారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీబీఐ, చంద్రబాబులకు తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు నామా నాగేశ్వర్రావు అవినీతి కనిపించడం లేదా.. అంటే లేదనే సమాధానం చెప్పాలి. ఖమ్మం జిల్లాలోని పాలేరు చక్కెర కర్మాగారాన్ని ఆ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వువ్వాడ అజయ్ కుమార్ ఉదహరిస్తున్నారు. 
రైతుల యాజమాన్యం నుంచి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కర్మాగారాన్ని నామా నాగేశ్వరరావుకు అప్పగించారని ఆయన చెబుతున్నారు. నాగేశ్వరావు ఇందుకు ప్రతిఫలంగా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టారనీ, ఇది నిజం కాదా అనీ.. ఇది ‘క్విడ్‌ప్రొకో’ కాదా అనీ ఆయన నిలదీస్తున్నారు. ఇంతటి అవినీతి చరిత్ర ఉన్న నామా  ఆర్థిక నేరాలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎంపీలతో కలిసి ప్రధాని వద్దకు వెళ్లడం ‘దొంగే దొంగ.. దొంగ’ అని అరిచినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎదుటి వారి ఆస్తుల అటాచ్‌మెంట్ కోరుతున్న  నామా పెద్ద ఆర్థిక నేరగాడనీ, విచారణ చేపడితే ఆయన నిజానిజాలు వెల్లడవుతాయని పువ్వాడ అంటున్నారు. 

తాజా వీడియోలు

Back to Top