పుష్కరాల చరిత్ర సమస్తం అవినీతి మయం

పుష్కరాల పనుల్లో కంపుకొడుతున్నఅవినీతి
ఇద్దరు మంత్రుల చుట్టూ తిరిగిన కేటాయింపులు
ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ తో పాటు మిత్రపక్షం బీజేపీ నుంచి సైతం విమర్శలు

రాజమండ్రి: పుష్కరాలు పూర్తయి రోజులు గడుస్తున్న కొద్దీ నిర్మాణ పనుల్లోని నాణ్యత రంగు వెలుస్తోంది. ప్రతీ చోట అవినీతి గుప్పు మంటోంది. రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ వేదికగా దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.  దీని మీద మొదటి నుంచి వైెఎస్సార్సీపీ విమర్శలు గుప్పిస్తూ వచ్చింది. 

మొత్తం అవినీతి మయం
పుష్కరాలకు గతంలో వంద, రెండు వందల కోట్ల రూపాయిల మేర కేటాయింపులు ఉండేవి. ప్రత్యేకాధికారిని నియమించి ప్రణాళికా బద్దంగా పనులు చేసేవారు. ఈసారి మాత్రం అంతా ఏకపక్షంగా సాగాయి. ఏకంగా 16 వందల కోట్ల రూపాయిల్ని పుష్కరాలకు కేటాయిస్తున్నట్లు ఘనంగా ప్రకటించుకొన్నారు. ఇన్ని వందల కోట్ల రూపాయిలు ఏ గంగలో పోశారో తెలియదు కానీ, అప్పుడే రాజమండ్రి రోడ్లన్నీ గుంతలు గా మారిపోయాయి. ప్రధాన ఘాట్ లలో మెట్లు కుంగిపోతున్నాయి.

ఆ ఇద్దరు మంత్రులు
సీనియర్ మంత్రి యనమల రామక్రష్ణుడు, నారాయణ పుష్కరాల పనుల కేటాయింపుల్లో చక్రం తిప్పారు. కేవలం ఈ ఇద్దరు చెప్పిన వారికే పనుల్ని గుడ్డిగా అప్పగించేశారు. నాణ్యతను ఏ మాత్రం చెక్ చేయకుండా పనులకుపచ్చ జెండా ఊపారు. ఇప్పుడు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి బిల్లులు పాస్ చేయించుకొంటున్నారు. నాణ్యతను చూసి అడ్డు చెప్పాల్సిన అధికారులు.. పైనుంచి వస్తున్న ఒత్తిడితో హడలి పోతున్నారు.

అన్ని వైపుల విమర్శలు
పుష్కరాల పనుల్లో అవినీతి మీద అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ పనుల్ని మొదట నుంచి గమనిస్తున్న వైఎస్సార్సీపీ .. ఈ బాగోతాన్ని ప్రజల ద్రష్టికి తీసుకొని వస్తూనే ఉంది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ స్వయంగా రాజమండ్రిలో పర్యటించి నాణ్యత లేకుండా పనులు సాగించటాన్ని తప్పు పట్టారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు బహిరంగంగా పుష్కరాల పనుల్లో అవినీతిని ప్రస్తావించారు. బిల్లులు పాస్ చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. 
Back to Top