అమరావతి: నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసం తపించే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వైయస్ జగన్ ఆయురారోగ్యాలతో, చిరకాలం జీవించాలని, బతుకులు మార్చాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. చిరకాలం చిరంజీవిగా బతకాలని మనసారా ఆశీస్తూ జననేత వైయస్ జగన్‌కు జన్మ దిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో వసంతంలో అడుగుపెడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కుంటుపడింది. ప్రజలకు అండగా ఉండేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును అంతే వయసు ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా ప్రజల క్షేమం కోసం ఆలోచిస్తున్న తీరు రాజకీయాల్లో నూతన అధ్యాయానికి తెర లేపింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇచ్చిస్వల్ప తేడాతో అధికారానికి దూరమైనా..ప్రజలకు దగ్గరగా ఉంటూ నేనున్నానని భరోసా కల్పిస్తున్నారు.
రాష్ట్ర విభజన, ఆర్థిక లోటు, ఎన్నికల హామీలు నెరవేర్చని ప్రభుత్వ తీరు, ప్రచారానికే తప్ప పనులు ప్రారంభం కాని రాజధాని, ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు... వంటి ఎన్నో సందర్భాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి పోరాటం చేసిన ఏకైక నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. చివరకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారేలా పోరాటం చేశారు. పార్టీ నాయకుల అభిప్రాయాలకు విలువ ఇస్తు, సీనియర్ల నిర్ణయాన్ని గౌరవిస్తూ ..పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు మనస్సు విప్పి మాట్లాడుతూ రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తన వద్ద ఉన్న అవినీతి సొమ్ముతో సంతలో పశువుల్లా కొనుగోలు చేసినా అధైర్యపడకుండా పోరాటం చేస్తున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రిలా అందరిని కలుపుకొని, అందరి అభిప్రాయాలకు విలువనిస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఉపయోగించుకొని ముందుకు సాగుతున్నారు. టీడీపీ పాలనలో అన్యాయానికి గురైన ప్రజలకు ధైర్యం చెప్పేందుకు గతేడాది నవంబర్ 5వ తేదీ వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ఇప్పటికీ చివరి జిల్లా శ్రీకాకుళంలో పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘ కాలం ప్రజల మధ్య ఉన్న ఏకైక నాయకుడు వైయస్ జగన్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇంతగా ప్రజల సమస్యలను దగ్గరుండి చూస్తూ వారిలో ఒక్కడిగా ఉంటున్నారు. ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరుతాయని రాష్ట్రమంతా ఎదురు చూస్తోంది.
నిరుడు కూడా ప్రజల మధ్యే ..‘ప్రజాసంకల్పయాత్ర’లో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది పుట్టిన రోజు వేడుకలను ప్రజల మధ్యే జరుపుకున్నారు. అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్‌ను పార్టీ నేతలు, అభిమానులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కూడా ప్రజల మధ్యే వైయస్ జగన్ ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
వైయస్ జగన్‌కు పునర్జన్మ..ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ అక్టోబర్ 25వ తేదీ విజయనగరం నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో విశాఖ ఎయిర్‌పోర్టులో వేచి ఉన్న సమయంలో టీడీపీ నేతకు చెందిన క్యాంటిన్‌లో పని చేస్తున్న శ్రీనివాసరావు అనే యువకుడి వైయస్ జగన్‌పై కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిజానికి వైయస్ జగన్‌కు ఇదో పునర్జన్మ. ఎందుకంటే.. గొంతులో దిగాల్సిన కత్తి ఆయన భుజానికి తగిలింది కాబట్టే అంతపెద్ద ప్రాణాపాయం నుంచి దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులు, ప్రేమ, ప్రార్థనల వల్ల తప్పించుకోగలిగాడు. నా బిడ్డ జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీ సమావేశంలోనే ప్రజలందరి మధ్యలో చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత.. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఏడేళ్ల కాలంలో.. జగన్ జైల్లో ఉన్న 16 నెలలు తప్పించి మిగతా కాలమంతా కూడా ప్రజల మధ్యలోనే ఎక్కువగా ఉన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి గారి మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాల పరామర్శకు వచ్చిన జగన్‌కు ప్రజలు ఓదార్పు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి సంబంధించిన ప్రతి సమస్యలోనూ ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు చేస్తూ జనంతో మమేకమయ్యాడు. ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వైయస్ జగన్‌కు అవకాశం ఇవ్వాలని ప్రజలంతా భావిస్తున్నారు. అందుకే రావాలి జగన్..కావాలి జగన్ అంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు.