చంద్రబాబు..ఎవరి మాట వినరు..!


ప్రజాస్వామ్య పరిపాలనలో
సాంప్రదాయాలు, విధానాలు, ఆనవాయితీలకు చంద్రబాబు పాతర వేస్తున్నారు. అదికారం చేతిలో
ఉందికదా అని చెలరేగిపోయి పాలన సాగిస్తున్నారు. దీంతో రాష్ట్రం పరిస్థితి అదోగతి
పాలవుతోంది.

రాష్ట్రంలో ప్రజలకు
సంబంధించి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అఖిల పక్ష సమావేశం
ఏర్పాటు చేయటం సాంప్రదాయం. ఈ భేటీకి అన్ని పార్టీల నాయకులు, సంబంధిత అంశానికి
సంబంధించిన ప్రజా సంఘాల నేతల్ని పిలిచి అభిప్రాయాలు తీసుకోవటం ఆనవాయితీ.

చంద్రబాబు అధికారంలోకి
వచ్చినప్పటి నుంచి అనేక ప్రదాన నిర్ణయాలు జరిగాయి. రాజదాని గుంటూరు జిల్లాలో
ఏర్పాటు చేయాలని ఏకపక్షంగా నిర్ణయించేశారు. హైదరాబాద్ లో మాదిరిగానే అన్ని వ్యవస్థలు
అక్కడే ఏర్పాటు చేయాలని మొండిగా ఫిక్సు అయిపోయారు. కనీసం అఖిల పక్షాన్ని
సంప్రదించలేదు. తర్వాత హుద్ హుద్ తుపాన్ దండెత్తింది. సహాయ చర్యలు తోచినట్లుగా
కానిచ్చేశారు. ఇటు, వ్యవసాయదారుల్ని ఆదుకొనే విషయంలో ఏమాత్రం పట్టించుకోలేదు.
ఏపీకి జీవన్మరణ సమస్య వంటి ప్రత్యేక హోదా విషయంలో కార్యాచరణ కోసం అఖిల పక్షాన్ని
పిలిచి రాష్టాన్ని అంతటినీ ఏకతాటిపైకి తెస్తే బాగుండేది. అదీ జరగలేదు. ఆఖరికి కరవు
ను ఎదుర్కొనే విషయంలో కూడా అందరి అభిప్రాయాలు తీసుకొనేందుకు  ఏమాత్రం ప్రయత్నించలేదు. దీంతో చంద్రబాబు మొండి
వైఖరి కళ్లకు కట్టినట్లు బయట పడింది.

Back to Top