బాబు మార్కు గ్రాఫిక్ మాయాజాలం

() డిజైన్ విష‌యంలో వివాదం
() కాపీ కొట్టారంటూ సామాజిక మాధ్య‌మాల్లో విమ‌ర్శ‌లు
() పున‌రాలోచ‌న‌లో ప్ర‌భుత్వం
హైదరాబాద్‌) అంతర్జాతీయ ఆర్కిటెక్ట్లతో హ‌డావుడి చేసిన చంద్రబాబు ప్ర‌భుత్వం చివ‌ర‌కు హంగామానే మిగిల్చింది. జపాన్ ఇచ్చిన డిజైన్ మీద విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతుండ‌టంతో పున‌రాలోచ‌న లో ప‌డింది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌ల జ‌డివాన‌కు జ‌డిసి డిజైన్ మార్చేందుకు కూడా సిద్ద ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. 

భారీ క‌స‌ర‌త్తు...ఫ‌లితం శూన్యం..
రాజధాని పరిపాలనా భవనాల డిజైన్ కోసం లండన్, ఇండియా, జపాన్ దేశాలను ఎంపిక చేసింది చంద్ర‌బాబు సర్కార్. అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఐకానిక్ కట్టడాలుగా డిజైన్లు ఉండాలని సూచించింది. ఆయా కంపెనీలు చేసిన డిజైన్లలో ఒకదాన్ని ఎంపిక చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్లతో క్రిస్టోపర్ బెనిగర్ నేతృత్వంలో ఒక జ్యూరీని ఏర్పాటు చేసింది. అందులో జపాన్కు చెందిన మకి అసోసియేట్స్ డిజైన్ను ఎంపిక చేశారు. దీనికోసం సీఆర్డీఏ మూడు నెలల పాటు నానా హంగామా చేసి, కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 
విమ‌ర్శ‌ల వెల్లువ‌
జ‌పాన్ ఇచ్చిన  డిజైన్లు అసెంబ్లీ, హైకోర్టు భవనాల మాదిరి లేదని... పరిశ్రమల్లోని పొగగొట్టాల మాదిరిగా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా చండీగఢ్ అసెంబ్లీ భవనానికి దగ్గరి పోలికలు ఉన్నాయని ఇందులో జపాన్ గొప్పతనం ఏముందనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో  ఐకానిక్ భవనాల డిజైన్లు మార్చాలా లేక మొత్తం 900 ఎకరాల పరిపాలనా భవనాల డిజైన్ను మార్చాలా అనే విషయంపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. సుమారు నాలుగైదు నెలల పాటు శ్రమించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత వాటిపై అభ్యంతరాలు వెల్లువెత్తడంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేత‌కానిత‌నం మ‌రోసారి బ‌య‌ట పడింది.

తాజా ఫోటోలు

Back to Top