సభలో కాల్ మనీ దుమారం.చర్చకు వైఎస్సార్సీపీ పట్టు..తెలుగుతమ్ముళ్లలో వణుకు సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షంపై ఎదురుదాడి
ఉప్పులేటి కల్పన...రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు చెప్పుకొని కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు చూడడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. మహిళకు ఎంతో గౌరవం ఇచ్చిన మహనీయుడు అంబేద్కర్ అని ఆమె అన్నారు. అలాంటి మహానేత ఆలోచనలను, ఆశయాలను చంద్రబాబు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. నిజంగా చంద్రబాబుకు అంబేద్కర్ మీద గౌరవం ఉంటే కాల్ మనీ సెక్స్ రాకెట్ కుంభకోణాలకు పాల్పడుతూ మహిళల మాన, ప్రాణాలను దోచుకుంటున్న రాక్షసుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఉప్పులేటి కల్పన వాపోయారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్ ముఠాతో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయని, అందుకే బడా బాబులను వదిలేసి చిన్నచిన్న వ్యాపారులను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.
గౌరు చరితారెడ్డికాల్మనీ ముసుగులో టీడీపీ సెక్స్ రాకెట్ నడుపుతున్న తీరు దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మహిళల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి..బిక్షాధికారుల్ని చేశారని ఆమె విమర్శించారు. వడ్డీ వ్యాపారం పేరుతో మహిళల ఆస్తులు, మాన ప్రాణాలు లాక్కొన్న చరిత్ర టీడీపీదని మండిపడ్డారు. ఇసుక, మద్యం, సెక్స్ రాకెట్ మాఫియాలకు పాల్పడుతూ రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు బలిపశువులను చేస్తున్నారని ఫైరయ్యారు. టీడీపీ తాను సాగిస్తున్న ఆకృత్యాలను ఇతర పార్టీలకు అంటించి బురదజల్లాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కాల్ మనీ కేసులో ఉన్న టీడీపీ నేతలందరినీ అరెస్ట్ చేయాలని చరితారెడ్డి డిమాండ్ చేశారు. కాల్ మనీ కేసుపై చర్చకు పట్టుబడితే స్పీకర్ తిరస్కరించడం బాధాకరమన్నారు.
శివప్రసాద్ రెడ్డి, దాడిశెట్టి రాజా.. శాసనసభలో స్పీకర్, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శివప్రసాద్ రెడ్డి, దాడిశెట్టి రాజాలు అన్నారు. మహిళల మాన, ప్రాణాలు పోయే దారుణ సమస్య ఉంటే ఇంతకన్నా గొప్ప సమస్యలున్నాయని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు కుటుంబసభ్యులకు ఇదే పరిస్థితి వస్తే ఆయన రేపు, ఎల్లుండి చర్చిద్దామంటూ ఊరుకుంటారా అని వారు ప్రశ్నించారు. బడుగు, బలహీన మహిళలంటే అంత చులకనా, కాల్ మనీ పేరుతో వారిని లోబర్చుకొని అసభ్యంగా వీడియోలు తీసి ప్రవర్తిస్తే ఎందుకు చర్య తీసుకోలేదన్నారు. నగరం నడిబొడ్డున సాగుతున్న కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నందునే చంద్రబాబు చర్చకు అనుమతించకుండా తప్పించుకుంటున్నారన్నారు. స్పీకర్ సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. మంత్రి ఒక రోజు సస్పెండ్ చేయమని చదవడం...స్పీకర్ రెండ్రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నామని చెప్పడం అంతా నాటకీయమన్నారు.