చంద్రబాబు కనుసన్నల్లో అసెంబ్లీ సమావేశాలు..!

అడుగడుగునా ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం..!
తాజాగా బిల్లుల పేరుతో హైడ్రామా..

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చంద్రబాబు కనుసన్నల్లో సమావేశాలు..!
అసెంబ్లీలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. సభలో ప్రతిపక్షానికి కనీస విలువ ఇవ్వడం లేదు. మైక్ కట్ చేయడం, మంత్రులను ఉసిగొల్పడం, ప్రజాసమస్యలపై చర్చించకుండా సభను పక్కదోవ పట్టించడమే ధ్యేయంగా చంద్రబాబు వ్యవహరించడం దౌర్భాగ్యం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చంద్రబాబు కనుసన్నల్లో అసెంబ్లీ సమావేశాలు జరగాల్సిరావడం దురదృష్టకరం. తాజాగా బిల్లుల పేరుతో మరో హైడ్రామాకు పచ్చప్రభుత్వం తెరతీసింది. ప్రతిపక్షానికి కనీస సమాచారం ఇవ్వకుండా బిల్లులను హడావిడా తీసుకురావడాన్ని  ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎలాంటి చర్చ, పరిశీలన లేకుండా బిల్లుల ఆమోదానికి తాము విరుద్ధమని జగన్ అన్నారు. ఇందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. 

బిల్లులతో సభలో అధికారపక్షం హైడ్రామా..!
బిల్లు ప్రతులను కనీసం వారం రోజుల ముందు సభలో ఇవ్వాలి. కానీ అలా ఇవ్వకుండా ఎలాంటి చర్చ లేకుండా అప్పటికప్పుడు బిల్లు ఎలా తీసుకొస్తారని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సభా నియమాలకు విరుద్ధంగా బిల్లులు సభలో ప్రవేశపెట్టడాన్ని జగన్ తప్పుబట్టారు.  బిల్లులోని లోటుపాట్లపై సమర్థవంతంగా చర్చ జరగాలి, సవరణ చేయాల్సి ఉంటుందని జగన్ అన్నారు. కానీ అవేమీ పాటించకుండా ప్రభుత్వం సడన్ గా బిల్లులు తీసుకొచ్చి దొడ్డిదారిన పాస్ చేసుకునే ప్రయత్నం చేయడం అవివేకమన్నారు. 

ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక ఢీలా..!
అసలు ప్రభుత్వం ఎటు పోతుంది, ఏ ఉద్దేశ్యంతో పనిచేస్తుందో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులైనా నిర్వహించాలని ముందు నుంచి వైఎస్సార్సీపీ కోరుతోంది. కానీ ప్రభుత్వం మొండివైఖరితో సమావేశాలను ఐదురోజులకు మాత్రమే కుదించింది. సభలో ప్రతిపక్షం తమను ఎక్కడ ఇరికిస్తుందోనని ,ప్రజల ముందు ఎక్కడ దోషిగా నిలబెడతామోనన్న ఆందోళనలో పచ్చనేతలు ఉన్నారు. ఈక్రమంలోనే అడుగడుగునా సభలో  ఆటంకం సృష్టిస్తున్నారు. ప్రజాసమస్యలపై ప్రతిపక్షనేత జగన్ గొంతెత్తిన ప్రతిసారీ పచ్చనేతలు అడ్డుకుంటున్నారు. అంతటితో ఆగకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతూ సభ నియమాలను మంటగలుపుతున్నారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక, ప్రజాసమస్యలపై చర్చించే ధైర్యం లేక ఆదరాబాదరగా ఐదురోజుల పాటు సమావేశాలు ముగించుకునేందుకు చంద్రబాబు సర్కార్ తెగ తాపత్రయపడుతోంది.
Back to Top