వైయస్‌ జగన్‌ను సీఎం చేయాలని ప్రజలంతా ఓట్లేశారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
 

కడప: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలంతా ఓట్లు వేశారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా నమ్ముతున్నారని, టీడీపీ ఎన్ని దాడులు చేసినా ప్రజలంతా వైయస్‌ఆర్‌సీపీకి ఓట్లేశారన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు చేసేవన్నీ చిల్లర చేష్టాలే అని విమర్శించారు. చంద్రబాబు తీరును చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. విలువలను దిగజార్చే కార్యక్రమాలను చంద్రబాబు మొదలుపెట్టారని,  ప్రజా తీర్పును హుందాగా గౌరవించాలని సూచించారు. 

ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
ఆడలేక మధ్యన ఓడ అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందని ఆయన తెలిపారు.  2014 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి..ఐదేళ్లు ఆవేవి కూడా నెరవేర్చకుండా ఎల్లోమీడియా సహకారంతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇటువంటి పార్టీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. గల్ఫ్‌ దేశంలో ఇలాంటి నేతను ఉరి తీసేవారన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు అన్నా క్యాంటీన్లు, పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ అంటూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేపట్టారన్నారన్నారు. ఇలాంటి నేతలకు ఓటర్లు తీర్పు ఇచ్చారన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అంటూ ధీమా వ్యక్తం చేశారు. 
 

Back to Top