జగన్‌మోహన్‌రెడ్డిగారి పై దాడిని చూస్తుంటే అందరూ ఒకే రకంగా ఒకే బాణిలో దాడులు జరుగుతున్నాయి. రోజుకొక అబద్దం పూటకొక కట్టుకధలు అల్లి జగన్‌మోహన్‌రెడ్డిగారి పై ఒక విష ప్రచారం చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకంలేనిది ఎవరికి, ధర్యాప్తులంటే మీకు నమ్మకంలేకనే జగన్‌మోహన్‌రెడ్డి గారిని దోషినిచేసేసి ఆయన తండ్రి
రాజశేఖరరెడ్డి గారిని కూడ దోషిని,నేరస్తుడిని చేసేసి పతాక శీర్షికలతోటి కొన్ని పత్రికలు రాస్తాయి.కొన్ని పార్టీలు మాట్లాడాతాయి,నిన్న మొన్నటిదాక మా గొప్ప ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు అని కీర్తించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు
ఈ రోజు అనుమానాలు వచ్చే విదంగా మాట్లాడాతారు.తండ్రినికొడుకుని భాద్యులను చేస్తు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడాలో వాళ్ళే నిర్ణయిస్తారు.
రాజకీయ స్యార్ధాలకోసం సీబీఐ ని ఓ పావుగా అధికారంలో ఉన్న పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి అని సీబీఐ మాజి డైరక్టర్లు, నిపుణులు మాట్లాడుతున్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి గారిని చూస్తే చంద్రబాబుకి చలిజ్యరం వస్తుంది, కాంగ్రెస్ నాయకులకు విషజ్యరాలు వస్తున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి వైపు ప్రజలున్నారు, మీవైపు 10 మంది కూడ జనంలేరు. అసలు రాజకీయరంగంలో అసలు జగన్‌మోహన్‌రెడ్డి లేకుంటే బావుండును అనే విదంగా ఉంది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పరిస్దితి. జగన్‌మోహన్‌రెడ్డి గారిని కొద్దిమందిగా ఉన్న వ్యక్తులు కొన్నొ సంస్దలు, ఒక సెక్షన్‌అఫ్ మీడియా,ఎవరు ఎన్నిరకాలుగా దుష్పచారం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి గారిని రెండేళ్ళుగా వెంటాడి వేదించినా సీబీఐ సాధించింది ఏంటి.....
జగన్‌మోహన్‌రెడ్డి గారి పేరు పలకంది నిద్రలేవని నాయకులున్నారు ఈ రోజు రాష్ట్రంలో అందరు లక్షకోట్లు. లక్షకోట్లు అని మాట్లాడుతున్నారే ఈరోజున సీబీఐ సాధించి, సోధించి, రకరకాలుగా ఇబ్బందులు పెట్టి వారికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగంచేసినా కూడ ఇవాళ 100కోట్లుని చూపించడానికి అపసోపాలు పడుతుంది సీబీఐ.నిందితులకు చార్జిషీట్‌లు అందడంలేదుగాని మీడియా వారికిబాగానే అందుతున్నాయి చార్జిషీట్ లు....100కోట్లు చూపించడానికే ఆపసోపాలు పడుతున్నా సీబీఐ తోకను పట్టుకుని ఈ రాజకీయ పార్టీలన్ని మాట్లాడుతా ఉంటాయి. రాజశేఖరరెడ్డి గారి లాగా ప్రజాభిమానం పోందలేక మీరు అవినీతి పై పోరాడే వాళ్ళగా, జగన్‌మోహన్‌రెడ్డి గారు అవినీతి పై పోరాటం చేస్తున్న పవిత్రులుగా కనీసం 100 ప్రజల గుండెల్లో ఉండే ప్రయత్నం చేసారా అని అడుగుతున్నాం. 100 మంది మా గుండెల్లో ఉన్నారు అని చెప్పే నేత ఎవరైన ఉన్నారా...... చట్టం న్యాయాన్ని తుంగల్లో తోక్కుతున్నా పార్టీలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు...ప్రజలను శాసించడానికి ప్రయత్నించిన రాజకీయనాయకులు అందరు మట్టిగోట్టుకుపోయారు. సీబీఐ కోర్టులో తప్పనిసరిగా హజరుకావాలని జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు చెప్పలేదు.ప్రజలు మన్ననలు పోందలేక జగన్‌మోహన్‌రెడ్డి గారిమీద అవకులు చెవాకులు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పేలుతున్నాయి.