ఈరోజుతో బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. అసెంబ్లీలో 29 రోజులలో ఏ రోజు ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ముగించిన ఘనత అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అయినా తెలుగుదేశం పార్టీకే దక్కిందని తెలియజేస్తున్నాను. ఈ రెండు పార్టీలు అసెంబ్లీని ఏవిధంగా నడిపించాలనుకున్నారో చివరిదాక అలాగే నడిపించారు. ప్రతిపక్ష పార్టీకి ఎప్పుడు కూడా అసెంబ్లీని ఎక్కువసేపు నడిపించుకోవాలని బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. అధికార పార్టీకి ఎప్పుడు కూడా అసెంబ్లీ నడవకపోతేనే మంచిగా ఉంటుంది. ఏ సమస్యలు చర్చకు రావు. తప్పించుకోడానికి ఓ అవకాశంగా ఉంటుంది. కాని ఈరోజు చంద్రబాబునాయుడు గారు సమావేశాలు ముగిసిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్లు పత్రికా సమావేశాలు పెట్టి ఏ ఒక్క చర్యకు రాలేదు. కోచ్చనవర్ చర్చకు రాలేదు షాట్ నోటీస్ డిస్కషన్¬కు రాలేదు అని చెప్పి దొంగే.. దొంగ దొంగ... అన్నట్టుగా ఉంది. అలాంటి వారు సమావేశాలు పెట్టి బడ్జెట్ సమావేశాలు సరిగా జరగడం లేదని అంటున్నారు. చంద్రబాబునాయుడు గారు కన్¬ఫ్యూజన్ స్టేజ్¬లో ఉన్నారు. ఏ విషయాన్ని ఎక్కడదాక తీసుకుపోవాలో ఎక్కడ వదిలేయాలో తెలియడం లేదు. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు మొదలైన తర్వాత మద్యం మీద ఇష్యూ టేకప్ చేశారు. 10 రోజులు అసెంబ్లీని స్తంభింపచేసి ఎక్కడా కూడా ఏ విషయం చర్చకు రాకుండా చేసి సడెన్¬గా సైలెంట్ అయిపోయారు. 10 తర్వాత ప్రజా సమస్యలు చాలా ఉన్నవి కాబట్టి ఒక మెట్టు దిగుతున్నాం అని అంటున్నారు. అప్పుడు ఎందుకు మద్యంపై చర్చ లేవనెత్తారు.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు అంటే మద్యంపై చర్చ జరిగితే అందులో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారు కాబట్టే దాని మీద చర్చ జరపలేదు. అదేగాదు తర్వాత అవినీతి మంత్రులమీద 10 రోజులు అసెంబ్లీ సమావేశాలు స్తంభింపజేసారు. కానీ ఆ విషయం ఎక్కడా కూడ తెలుగుదేశం పార్టీగానీ, కాంగ్రెస్ పార్టీగానీ ఇద్దరూ కుమ్మక్కై ఆ విషయాన్నిచర్చకు రాకుండా చేసారు. అవినీతి మంత్రుల మీద చర్చ జరిగితే ఆ 26 జి.ఓ.లు మీద చర్చ జరిగితే జగన్¬¬మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదని చెప్పాల్సివస్తుందని చర్చకు రాకుండా అడ్డుకున్నారు. మొన్న ధర్మానప్రసాద్ గారి మీద ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఆయన సమాధానం చెప్తుంటే ఆయనను వారించారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని ఒక రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రజలు కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు రాత్రిపూట కరెంట్ ఉండటంలేదు. అలాగే త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాలు వేడుకలు జరుపుకుంటున్నారు. దానికి శంకర్¬రావు గారు శుభాకాంక్షలు తెలియజేసారు. అంటే ఒకపక్క జగన్¬మోహన్ రెడ్డి గారి మీద కేసు వేయాలంటే కలిసి కేసులేస్తారు. కొవ్వూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు... వైయస్¬ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయవద్దు అన్నారు. కావాలంటే తెలుగుదేశం పార్టీకి వేయండి అని చెప్పారు. ఈ కండీషన్¬తో కొవ్వూరు ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 1 నుండి కరెంట్ చార్జీలు పెంచడానికి సిద్ధమవుతున్నారు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారికి సాధ్యమైన పనులు మీకు ఎందుకు సాధ్యం కావడం లేదు అని అడుగుతున్నాం. ఎవరూ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. కేంద్రం కూడా దృష్టి పెట్టడం లేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. ప్రజా సమస్యలతో ప్రజలలోకి వెళ్లడం లేదు. ఇలాగే ఉంటే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగలేరు.