వైయస్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేతగా మేకపాటి

హైదరాబాద్, 31 మే 2014:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేతగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపికయ్యారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నివాసంలో సమావేశమైన ఎంపీలు ‌ ఫ్లోర్‌ లీడర్ ఎంపిక అధికారాన్ని శ్రీ జగన్‌ అప్పగిస్తూ తీర్మానించారు. అనంతరం మేకపాటిని‌ పార్లమెంటరీ పార్టీ నేతగా  శ్రీ జగన్ ఎంపిక చేశారు. అలాగే పార్టీకి సంబంధించి తెలంగాణ శానసభా పక్ష నేతగా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును ఎంపిక చేశారు. వీటితో పాటు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విభాగం అడ్‌హాక్‌ కమిటీని, పార్టీ జాతీయ అధికార ప్రతినిధులను కూడా ఒక ప్రకటనలో ప్రకటించారు.

పార్టీ పార్లమెంటరీ పార్టీ కమిటీ :
మేకపాటి రాజమోహన్‌రెడ్డి : పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కొత్తపల్లి గీత : ‌పార్లమెంటరీ పార్టీ ఉప నాయకురాలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి : కార్యదర్శి, బుట్టా రేణుక : కోశాధికారి, వైవీ సుబ్బారెడ్డి : విప్.

పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు :
వి. వరప్రసాదరావు, వైయస్. అవినాశ్‌రెడ్డి, పి.వి. మిథున్‌రెడ్డి (పార్టీ పార్లమెంట్‌ కో ఆర్డినేటర్‌గా కూడా వ్యవహరిస్తారు).

తెలంగాణ వైయస్ఆర్‌సీపీ అడ్‌హాక్‌ కమిటీ :

పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఎంపీ), గట్టు రామచంద్రరావు, బి. జనక్‌ ప్రసాద్, నల్లా సూర్యప్రకాశ్, రహ్మాన్, తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కె. శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పి. విజయారెడ్డి.

తెలంగాణ వైయస్ఆర్‌సీపీ లెజిస్లేటివ్‌ పార్టీ కమిటీ:
తాటి వెంకటేశ్వర్లు (శాసనసభా పక్ష నాయకుడు), పాయం వెంకటేశ్వర్లు (ఉప నాయకుడు), మదన్‌లాల్‌ నాయక్‌ (విప్).

Back to Top