కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించండి

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ
ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం ఘటనపై కేంద్ర సంస్థలతో
దర్యాప్తు చేయించాలని వైయస్ ఆర్ కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ప్రభుత్వానికి
విజ్ఞప్తి చేసింది. పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులు ఢిల్లీలో కేంద్ర
మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలుసుకుని ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. అంతేకాకుండా
తిత్లీ తుఫాను బాధితులకు కూడా సహాయం అందించాలని కోరారు. ఆ బృందంలో వైవీ
సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్త సత్యనారాయణ, ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, వరప్రసాద్‌ ఉన్నారు. Back to Top