తూర్పు గోదావరి: వైయస్ జగన్ హామీతో యువతలో ఉద్యోగాలు వస్తాయన్న ఆత్మసై్థర్యం వ చ్చిందని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు పేర్కొన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే స్థానికులకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడం విప్లవాత్మకమైన నిర్ణయమని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు అన్నారు. ప్రతి ఏటా నోటీఫికేషన్ విడుదల చేసి, ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామనడం గొప్ప విషయమన్నారు. కాకినాడలో ఎన్నో ప్రైవేట్ సంస్థలు ఉన్నా..స్థానికులకు ఉద్యోగాలు లేవన్నారు.