పోటెత్తిన కొత్త‌వ‌ల‌స‌

విజ‌య‌న‌గ‌రం:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కొద్ది సేప‌టి క్రితం కొత్త వ‌ల‌స చేరుకుంది. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అంత‌కుముందు పాద‌యాత్ర 3 వేల కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటిని సంద‌ర్భంగా దేశ‌పాత్రునిపాలెం వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ పైలాన్ ఆవిష్క‌రించారు. కొత్త వ‌ల‌స వ‌ద్ద ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు వేలాదిగా జ‌నం త‌ర‌లిరావ‌డంతో ప‌ట్ట‌ణం పోటెత్తింది. అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు. 
Back to Top