<br/><br/>శ్రీకాకుళం: కళింగ కోమట్లకు కార్పొరేషన్‌తో పాటు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కళింగ కోమట్లు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తమను ఓబీసీలో చేర్చడంతో పాటు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జననేతను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన వైయస్ జగన్ కార్పొరేషన్‌తో పాటు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.