రామభద్రపురం శివారు 291వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 

విజయనగరం జిల్లా : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర సోమవారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం శివారు నుంచి ప్రారంభమైంది. వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు రానున్నాడనీ..అందరీ జీవితాలకూ వెలుగులు తీసుకొచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయన వస్తే గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లో జనం ఆరాట పడుతున్నారు.

జననేత ఎప్పుడు తమ ప్రాంతానికి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. రామభద్రపురం శివారు నుంచి పాదయాత్ర  తారాపురం, మిర్తివలస క్రాస్‌, కొట్టిక్కి జంక్షన్‌, జిన్నివలస క్రాస్‌ మీదుగా సాలూరు వరకు కొనసాగనుంది. సాయంత్రం సాలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. 
 
Back to Top