అనంతపురం జిల్లా: తమ గ్రామంలో రోడ్లు లేవు, నీళ్లు రావు, పింఛన్లు ఇవ్వడం లేదని వీరారెడ్డి కాలనీ వాసులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంగళవారం తమ గ్రామానికి వచ్చిన వైయస్ జగన్‌కు కాలనీవాసులు కలిసి సమస్యలు చెప్పుకున్నారు. గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని అడిగితే జైల్లో పెడుతామని హెచ్చరిస్తున్నారని స్థానికులు వైయస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు. 70 ఏళ్లు ఉన్నా కూడా తనకు పింఛన్ ఇవ్వడం లేదని కాలనీకి చెందిన సుబ్బమ్మ అనే మహిళ వాపోయింది. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి పింఛన్ ఇచ్చేలా కలెక్టర్‌కు లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. మరో ఏడాది ఓపిక పడితే నెలకు రూ.2 వేల పింఛన్ ఇస్తానని మాట ఇచ్చారు.