పాఠ్యపుస్తకాలు అందలేదన్నా..


శ్రీకాకుళంః విద్యా సంవత్సరం ముగియబోతున్న ఇంకా పాఠ్య పుస్తకాలు అందలేదని చాపర ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు వాపోయా. పుస్తకాలు లేని కారణంగా తమ చదువులు ఆగిపోయాయని టెన్త్‌ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొ పుస్తకాన్ని పంచుకుని చదుకోవలసి వస్తుందన్నారు.పరీక్షలకు కేవలం రెండు నెలలే సమయం ఉందని, పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నామని  వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. పుస్తకాలను అరకొరగా సరఫరా చేస్తున్నారని వాపోయారు. పాఠశాలలో వసతులు కూడా సరిగా లేవని విద్యార్థులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.
 
Back to Top