అన్నా ఆర్టీసీని ఆదుకోండి

శ్రీకాకుళంఃప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను ఆర్టీసీ ఉద్యోగులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.వేతన సవరణ చేయాలని,కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ జననేతకు వినతిపత్రం సమర్పించారు.కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరారు.నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ఆదుకోవాలన్నారు.నిత్యావసర ధరలు పెరుగుపోయాయని,ఆర్టీసీ జీతభత్యాలు అరకొరగానే ఉందన్నారు.ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు.అన్ని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

తాజా వీడియోలు

Back to Top