చిన్నారుల‌కు అక్ష‌రాభ్యాసం


తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు త‌మ బిడ్డ‌ల‌కు జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా అక్ష‌రాభ్యాసం చేయించుకుంటున్నారు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన వారిని ఆప్యాయంగా పల‌క‌రిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ వారి బిడ్డ‌ల‌కు ప‌ల‌క‌పై అక్ష‌రాలు రాయించి, ప‌లికిస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌తో అక్ష‌రాభ్యాసం చేయించుకోవ‌డంతో త‌ల్లిదండ్రుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌చ్చాక మీ బిడ్డ‌ల‌ను చ‌ద‌వించే బాధ్య‌త తీసుకుంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ వారికి హామీ ఇచ్చారు.
Back to Top