గుంటూరు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 132వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఆయన మంచికలపూడి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి మెరంపూడి క్రాస్, తుమ్మపూడి క్రాస్, రేవేంద్రపాడు మీదగా పెదవడ్లపూడి వరకూ ప్రజసంకల్పయాత్ర కొనసాగనుంది. పెదవడ్లపూడిలో వైయస్ జగన్ ప్రజలతో మమేకం అవుతారు. <br/>