<strong>విజయనగరంః </strong>ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర బొబ్బిలి నియోజకవర్గంలో కొనసాగుతోంది. <strong> </strong>287వ రోజు నాటి పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. లక్ష్మిపురం క్రాస్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు ప్రజలు భారీసంఖ్యలో ఘన స్వాగతం పలుకుతున్నారు. దారిపొడవునా జననేత కోసం ప్రజలు బారులు తీరారు. సమస్యలు చెప్పుకోవడానికి, రాజన్న బిడ్డను చూడడానికి ఎదురుచూస్తున్నారు. బాడండి,ముగడ, చిన్న భీమవరం క్రాస్ మీదగా పెద భీమవరం వరుకు పాదయాత్ర కొనసాగుతుంది. <br/>