వెల్దుర్తిలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని శనివారం నాడు పలువురు ముస్లిం సోదరులు, మత పెద్దలు కలుసుకుని తమ సమస్యలను వివరించారు. మౌజమ్ పేష్మామ్,ఇమామ్ లకు ఇచ్చిన హామీని తెలుగుదేశంపార్టీ , ప్రభుత్వం విస్మరించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఇస్తామని చెప్పి తమ గురించి పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకుని వచ్చారు. వీరికి న్యాయం జరిగేలా చూస్తానని ఈ సందర్భంగా వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.<br/>