వైయస్‌ జగన్‌ను కలిసిన కోటంక గ్రామ మహిళలు

అనంతపురం జిల్లా శింగనమల నియోజగకర్గం గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో వైయస్‌ జగన్‌కు మహిళలు ఘన స్వాగతం పలికారు.  మహిళలు వారి సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. పింఛన్లు, రేషన్‌ అందడం లేదని వాపోయారు. చిన్నారులను బడికి పంపితే చదివించే బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు మాటలు నమ్మి ఓటేశామని నిరుద్యోగుల తల్లిందండ్రులు వైయస్‌ జగన్‌ ఎదుట వాపోయారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని తమ గోడు వెళ్లోబోసుకున్నారు. మద్యం దుకాణాల వలన తమ కుటుంబాలు చితికిపోతున్నాయని అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపులను మూయించాలని వైయస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య కార్మికులు తమకు వేతనాలు ఇవ్వడం లేదని తెలిపారు. సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఉద్యోగులు తమను క్రమబద్ధీకరించాలని కోరారు. తమ గ్రామం గుండా వైయస్‌ జగన్‌ ప్రజా సంకలప్ప యాత్ర చేయడం సంతోషంగా ఉందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Back to Top