అనంతపురంలోనే వేరు శెనగ కొనుగోలు జరపాలి

31 వ రోజు శింగనమల నియోజకవర్గం మార్తాడు నుంచి ప్రారంభమై కోటంక, కమ్మూరు మీదుగా ఉరవకొండకు చేరుకుంది. ఆదివారం కావడంతో విద్యార్థులు, యువత ఎక్కువగా పాదయాత్రలో కనిపించారు. బీసీలను చంద్రబాబు పట్టించుకోవడంలేదని బీసీ నాయకులు వాపోయారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశాలను కల్పించడంలో వైయస్‌ జగన్‌కు ఎవరూ సాటి రారని బీసీలు పేర్కొన్నారు. చరిత్రలో తొలిసారిగా రజకులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని చెప్పిన నాయకుడు వైయస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. మార్తాడు గ్రామంలో తనను కలిసేందుకు వచ్చిన మహిళలతో వైయస్‌ జగన్‌ ముచ్చటించారు. అధికారంలోకి వస్తే అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నవ రత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలలని పిలుపునిచ్చారు. మీ పిల్లలను ధైర్యంగా బడికి పంపాలని చెప్పారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని చెప్పారు.
 ఈ సందర్భంగా వేరు శెనగ రైతులు జన నేతను కలుసుకుని తమ గోడు వెలిబుచ్చుకున్నారు. ముఖ్యంగా ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించుకోడానికి కూడా నానా పాట్లు పడాల్సి వస్తోందని, పంటనంతా కర్నూలు గానీ, పొరుగు రాష్ట్రంలోని  బళ్లారి కి గానీ తీసుకెళ్లాల్సిన దుస్థితి ఉందని వారు వాపోయారు. గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. గుత్తి వ్యవసాయ మార్కెట్‌లో కొనుగోలు చయడం లేదని.. దళారులను ఆశ్రయించక తప్పని పరిస్థితులు ఉన్నాయని వారు  వాపోయారు. పండించిన పంటను సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి రావడంతో ట్రాన్స్‌పోర్టు చార్జీలు భరించలేకపోతున్నామని చెప్పారు. తమ పంటను విక్రయించడానికి వీలుగా అనంతపురంలోనే వేరు శెనగ కొనుగోళ్ల కేంద్రాన్ని ఏర్పాటుచేయాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. 

Back to Top