శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, అభిమానుల సందడిల మధ్య దండు గోపాలపురం వద్ద కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి,ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి తదితరులు అనేక మంది పాల్గొన్నారు. పాదయాత్ర దారిపొడవునా జననేత పుట్టిన రోజు కోలాహలంతో పండుగ వాతావరణం నెలకొంది.