నాపై మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 
 

అమ‌రావ‌తి : తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 'గత ఏడాదిగా నాకు అండగా ఉంటూ నాపై మీరు చూపించిన ప్రేమకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు కొత్త ఏడాదిలో ఆ దేవుడు ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ట్విటర్‌లో వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top