ప్ర‌జల సొమ్మును వాటాలుగా పంచుకుంటున్నారు

కర్నూలుః  శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త బుడ్డా శేషారెడ్డి ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలోని 4వ వార్డులో శేషారెడ్డి పర్య‌టిస్తూ స్థానిక ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్ర‌బాబు హ‌యాంలో అవినీతి పాల‌న కొన‌సాగుతోంద‌ని విమ‌ర్శించారు. రాజ‌ధాని పేరుతో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా దోచుకుంటూ పేద ప్ర‌జ‌ల‌ను అన్యాయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. పేద‌ల‌కు అందాల్సిన సంక్షేమ ప‌థ‌కాల‌న్నీ టీడీపీ నేత‌లే దోచుకుతింటున్నార‌ని ఆరోపించారు. జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో టీడీపీ నేత‌లు పేద‌ల సొమ్మును వాటాలుగా పంచుకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రంలో ప్ర‌జా రంజ‌క ప‌రిపాల‌న రావాలంటే అది వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితోనే సాధ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. 


Back to Top