బాబుకు బుద్ధి చెబుదాం

ప్ర‌కాశం: న‌య‌వంచ‌క హామీల‌తో మోసం చేసిన చంద్ర‌బాబుకు రాబోయే ఎన్నిక‌ల్లో త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త య‌డం బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. చీరాల, వేట‌పాలెం మండ‌లంలో ఆయ‌న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మోసాల‌పై ముద్రించిన ప్ర‌జాబ్యాలెట్‌ను ఇంటింటికి పంచారు. అనంత‌రం య‌డం బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప‌రిపాల‌న‌ను గాలికొదిలేసి చంద్ర‌బాబు స‌ర్కార్ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా అవినీతికి పాల్ప‌డుతుంద‌న్నారు. అమ‌రావ‌తి పేరుతో రియ‌లెస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయ‌ల‌ను దోచుకుంటున్నార‌ని ఆరోపించారు. ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయితే రాష్ట్రంలో ప్ర‌జాపాల‌న కొన‌సాగుతుంద‌న్నారు. చంద్ర‌బాబుది నియంత‌పాల‌న అని విమ‌ర్శించారు. య‌డం బాలాజీ వెంట మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు కొలుకుల వెంక‌టేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

కందుకూరు నియోజ‌క‌వ‌ర్గం ఉల‌వ‌పాడు మండ‌లంలోని వీరేప‌ల్లి పంచాయ‌తీ ప‌రిధిలో వైయ‌స్ఆర్ సీపీ నేత తూమాటి మాధ‌వ‌రావు గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. స్థానిక ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణాంత‌రం ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను ఒక్కొక్క‌టిగా చంద్ర‌బాబు నీరుగారుస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌లంతా వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని సీఎం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు.  2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పార్టీని బంగాళాఖాతంలో క‌లుపుతార‌ని హెచ్చ‌రించారు. 

Back to Top