బాబు మోసాలను తిప్పికొట్టండి

కనీస అవసరాలు తీర్చలేకపోయారు
ప్రకాశం(మార్కాపురం))రక్షిత మంచినీరు అందక.. మినరల్‌వాటర్‌ను కొని తాగే స్థోమత లేక ఫ్లోరైడ్‌ నీటితో గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి నెలొకొందని కొండాయపాలెం, దొండ్లేరు, సలకనూతల ప్రాంత ప్రజలు మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకట్‌రెడ్డి వద్ద తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు.  ప్రతి గడపకు తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కనీస ప్రజా అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. 

తెలివిగా తిప్పికొట్టండి
విజయనగరం (కురుపాం))హామీలు నెరవేర్చకుండా గద్దెపై కూర్చున్న చంద్రబాబు మళ్లీ అవే మోసపూరిత హామీలతో భవిష్యత్తులో ఓట్ల కోసం వస్తాడని ప్రజలు తెలివిగా తిప్పికొట్టాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రజలకు పిలుపునిచ్చారు. గడపగడపకు వైయస్సార్‌ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా కొమరాడ మండలంలోని కెమిశిల, తులసివలస గ్రామాల్లో పర్యటించారు. నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలలు, రైతులకు ఎలాంటి హామీలిచ్చి మోసం చేశారో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానికులు  తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. 

Back to Top