సీబీఐని అడ్డు పెట్టుకొని ఎన్నాళ్లు బంధిస్తారు?

వైయస్ పథకాలు పేదలకు లబ్ధి చేకూరాయనే అక్కసుతో వాటికి తూట్లుపొడుస్తున్నారు. జగ‌‌న్మోహన్‌రెడ్డి కాంగ్రె‌స్‌ పార్టీలోనే ఉండి ఉంటే వైయస్ సంక్షేమ పథకాలన్నింటినీ ప్రభుత్వం ఎప్పుడో ఎత్తివేసేది. బయట ఉండి నిరంతరం పోరాటం చేయడంవల్లే అవి కొనసాగుతున్నాయి. అందుకే కాంగ్రెస్ పెద్దలు సీబీఐని అడ్డంపెట్టుకొని జగ‌న్‌ను అక్రమంగా నిర్బంధించారు. సీబీఐని అడ్డుపెట్టుకొని కుట్రలతో ఎన్నాళ్లు బంధించగలరు?
- శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే

సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం :
పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో వైయస్ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. మహానేత రెక్కల కష్టంతో తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని ఏలుతున్న పాలకులు మాత్రం ఆయన పథకాలకు తూట్లుపొడుస్తున్నారు. ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది.
-మేకపాటి రాజమోహన్‌రెడ్డి (ఎంపీ)

ఉన్నత విద్యను పేదోళ్ల హక్కుగా మార్చారు :
ఉన్నత విద్యను పేద విద్యార్థులకు ఒక హక్కుగా తీర్చిదిద్దిన ఘనత వైయస్‌కే దక్కుతుంది. ఆయన మరణానంతరం విద్యార్థులు రోడ్డున పడే దుస్థితి వచ్చింది.
-మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే

జగన్‌ను అడ్డుకోవడమే వారి పని :
దివంగత మహానేత ప్రజల నుంచి దూరమయ్యాక కాంగ్రెస్, టీడీపీ ‌రెండూ కుమ్మక్కై ప్రజాసమస్యల్ని గాలికొదిలేశాయి. కేవలం జగన్మోహన్‌రెడ్డిని అడ్డుకోవాలనే ఆలోచనలతో కుట్రలు, కుతంత్రాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.
- ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే

రైతులు, విద్యార్థులతో కన్నీరు పెట్టిస్తున్నారు :
తమ కంట కన్నీరు పెట్టిస్తున్న ఈ ప్రభుత్వాన్ని రైతులు, విద్యార్థులు త్వరలోనే సముద్రంలో కలిపేస్తారు. వైయస్ కలలు కన్న ప్రభుత్వం త్వరలో‌నే వస్తుంది.
- కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే

దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి :
వైయస్ వల్ల గెలవలేదని చెప్పేవారంతా రాజీనామా చేసి గెలవాలి. వై‌యస్ మరణానంతరం ప్రజలు కష్టాలపాలవుతున్నారు.
-ధర్మాన కృష్ణదా‌స్, ఎమ్మెల్యే

కాంగ్రెస్‌ జేబు సంస్థ‌ సీబీఐ :
కాంగ్రెస్ చేతిలో సీబీఐ కీలుబొమ్మగా తయారైంది. ప్రభుత్వాన్ని కాపాడుతున్నందుకు చంద్రబాబుపై విచారణ జరగడం లేదు. పథకాలు అమలు చేయాలని నిలదీసినందుకు జగ‌న్‌ను నిర్బంధించారు.
-శ్రీనివాసులు, ఎమ్మెల్యే

సీఎం అంటే వైయస్‌లా ఉండాలి :
ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో దివంగత ముఖ్యమంత్రి మన దేశానికి చాటిచెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైయస్‌లేని లోటు కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
- మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే

పేదల్ని అణిచివేసే కుట్ర :
పేదలంటే గిట్టని చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రచేస్తోంది. జగ‌న్మోహన్‌రెడ్డి బయట ఉంటే వారి ఆటలు సాగవనే ఉద్దేశంతో అక్రమంగా బంధించి ప్రజలను కష్టాలపాలుచేస్తున్నారు.
-పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే

సమాజాన్ని చదివిన మహానాయకుడు :
దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డి డాక్టర్‌గా సమాజాన్ని చదివారు. అందుకే ప్రజలకు ఏది అవసరమో తెలుసుకోగలిగారు. పేద ప్రజలకు ఒక హక్కుగా తిండి, గూడు, ఆరోగ్యాన్ని అందించగలిగారు.
-గొల్ల బాబురావు, ఎమ్మెల్యే

ప్రభుత్వం కళ్లు తెరవాలి :
ఎలాంటి షరతులు లేకుండా శాచ్యురేషన్‌ (సంతృప్త) పద్ధతిలో ఫీజుల పథకం అమలు చేయాలనే డిమాండ్‌తో విజయమ్మ చేస్తున్న దీక్షతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. గతంలో వైయస్‌ అమలు చేసిన విధానాన్ని కొనసాగించాలి.
- వైయస్ వివేకానందరెడ్డి, మాజీమంత్రి

ఫీజుదీక్ష శిబిరంలో ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహ‌న్‌రెడ్డి, పార్టీ నేతలు జనక్‌ప్రసాద్, మేరుగ నాగార్జున, విశ్వేశ్వరరెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఎ‌స్.సంతో‌ష్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, వంగపండు ఉష, సామినేని ఉదయభాను, బి.జనార్దన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శివకుమార్, శ్రీనివాసనాయుడు, కె.కె.మహేంద‌ర్‌రెడ్డి, రవీంద్రనాయక్, రెహమాన్, మర్రి రాజశేఖ‌ర్, ఎడ్మ కిష్టారెడ్డి, బోడ జనార్ద‌న్, రా‌జ్‌ఠాకూర్, పుత్తా ప్రతా‌ప్‌రెడ్డి, ఆదం విజయ్‌కుమార్, సలీంబాషా, విజ‌య్‌చందర్ ప్రసంగించారు.
Back to Top