బాబు పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయి ఉన్నారు


కృష్ణలంక : చ‌ంద్ర‌బాబు నాయుడు పాల‌న‌తో రాష్ట్ర ప్ర‌జ‌లు విసిగిపోయి ఉన్నార‌ని కార్పొరేట‌ర్ దామోద‌ర్ విమ‌ర్శించారు. అమ‌లుకు నోచుకోని ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఏమీ చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్ కుటుంబంలో భాగంగా శుక్ర‌వారం 15వ డివిజ‌న్ అధ్యక్షుడు తంగిరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ  వైయ‌స్ఆర్ కుటుంబం`` కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ దామోద‌ర్ మాట్లాడుతూ  ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి తమను మోసం చేశాడంటు పలువురు మహిళలు, బాబు వస్తే జాబు వస్తుందని యువతను మభ్య పెట్టి ఓట్లు దండుకున్నడంటు పలువురు యువకులు ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలపై ఆగ్ర‌హం వ్య‌క్తం  చేస్తున్నార‌ని పేర్కొన్నారు.  ప్రజాసంక్షేమం కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  నవరత్నాల వంటి తొమ్మిది సంక్షేమ పథకాలను రూపొందించారన్నారు. వాటితో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధిచేకురుతుందన్నారు. అనంతరం నవరత్నాలు పై ముద్రించిన కరపత్రాలను అందజేసి, వైయ‌స్‌ జగన్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం డివిజన్‌లోని ప్రజలను వైయ‌స్ఆర్ కుటుంబంలోకి  ఆహ్వానిస్తు సభ్యత్వాలు నమోదు చేశారు. ఈ కార్యాక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కడియాల నాగు, అయ్యప్పరెడ్డి, తిరుపతిరెడ్డి, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
Back to Top