బాబుపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు

  • గడపగడపలో కార్యక్రమానికి విశేష స్పందన
  • హామీలు విస్మరించిన బాబుపై ప్రజాగ్రహం

రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం మహోద్యమంగా సాగుతోంది. గడపగడపలో వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈసందర్భంగా బాబు రెండేళ్ల మోసపూరిత పాలనను పార్టీ నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యె కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్టీ నేత ఆనం విజయకుమార్ రెడ్డి తదితరులు కొత్తవెల్లంటి, పాత వెల్లంటి, కందమూరు, ఉప్పుటూరు తదితర గ్రామాల్లో గడపగడపలో పర్యటించారు. అదేవిధంగా వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆర్ కె. రోజా, నారాయణస్వామి తదితర నేతలు నియోజకవర్గ పరిధిలోని  ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను ఎండగట్టారు. తిరుపతిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి గడపగడపలో పర్యటిస్తూ ప్రజల కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిదంగా శ్రీకాకుళం జిల్లా  నరసన్న పేట నియోజకవర్గంలోని శ్రీముఖ లింగం గ్రామ పంచాయతీ లో  గడప గడపకూ వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని చంద్రబాబు మోసాలు వివరిస్తూ...ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి తదితరులు ముందుకు సాగుతున్నారు. 
రాష్ట్రంలో బాబు చేస్తున్న అవినీతి, అక్రమాలు, దురాగతాలను నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. ఎన్నికల హామీలకు సంబంధించి వందప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ ను ప్రతీ గడపలో అందించి వారి నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ప్రతీ ఇంటా ఒకే మాట వినిపిస్తోంది. తమను మోసం చేసిన బాబుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Back to Top