ఐ.పోలవరం: ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు పాలనపై ప్రజలు విరుచుకు పడుతున్నారు. కేశనకుర్రు ఒకటవ వార్డు జాంబవానిపేటలో జరిగిన గడప గడపకూ వైయస్సార్‌కార్యక్రమంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ పాల్గొని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలలో మౌలిక సదుపాయాలు కరువై నానా అవస్థలు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, ప్రధానంగా రహదారుల నిర్మాణం లేకపోవడం, మురుగునీరు తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఫింఛన్లు, గృహాల మంజూరు వంటి ప్రభుత్వ పథకాలు పేదలకు అందటం లేదని పలువురు వాపోయారు. కొమానపల్లి సత్యం, ముమ్మిడివరపు నాగభూషణం తదితరులు ఇంటి రుణాలు మంజూరు చేయాలని, కత్తుల సంతోషరావు, ఉందుర్తి చంటిబాబు, పలివెల ఏడుకొండలు తదితరులు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏవిధికి వెళ్లినా అక్కడి ప్రజలు సమస్యలపై ఏకరువు పెట్టారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కొమానపల్లి అర్జన్న కుటుంబానికి బాలకృష్ణ రూ.500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పార్టీ మండల కన్వీనర్‌పిన్నంరాజు వెంకటపతి రాజు(శ్రీను), కాశి బాలమునికుమారి, దంతులూరి రవివర్మ, బళ్ల వెర్రబ్బాయి, లంక శ్రీధర్, కత్తుల సుదర్శన్, రేవు యజ్ఞశ్రీ, మచ్చా నాగబాబు, షేక్‌మీరాసాహెబ్, బొంతు కనకారావు, మోర్త చిన్నా, బుడిత నాగన్న, రేవు సత్యనారాయణ, పల్ల సత్తిబాబు, తాళ్లూరి ప్రసాద్, వీధి శేఖర్‌బాబు, యలమంచలి వాసు, పులపకూర వెంకటరావు, పరమట త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.