గాడితప్పిన పాలన
విశాఖపట్నం(యలమంచిలి))చంద్రబాబు పాలనలో ప్రజలు తీరని అవస్థలు పడుతున్నారని జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ అన్నారు. గడపగడపకు వైయస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా ఆయన యలమంచిలి మండలం, ఉమ్మలాడ గ్రామంలో బొడ్డెడ ప్రసాద్ తో కలిసి పర్యటించారు. వైయస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్రంలో ప్రశాంతత ఉంటుందని ఆయన తెలిపారు. చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారే తప్ప పాలన చేయడంలేదని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశారని మండిపడ్డారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి దేవుడని, ఆయనవల్లే రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని బొడ్డెడ ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైయస్ జగన్ సీఎం కావాల్సిందే
రాంబిల్లి))రాజన్న చూపిన రామరాజ్యం మళ్లీ రావాలంటే వైయస్ జగన్ సీఎం కావాల్సిందేనని ప్రజలు స్పష్టం చేశారని యలమంచిలి నియోజకవర్గ కన్వీనర్ ప్రగడ నాగేశ్వర్ అన్నారు. గడపగడపకు వైయస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా ఆయన రాంబిల్లి మండలం కొత్తపట్నం చీవార యాతకోత్తపట్నం గ్రమంలో పర్యటించారు. చంద్రబాబు ప్రజలను మోసం చేసి సీఎం అయ్యారని తెలిపారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబుకు ఓట్లేసి తప్పుచేశాం
అక్కయ్యపాలెం)) చంద్రబాబు మాటలను నమ్మి ఒకసారి మోసపోయాం.. మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేమని 32వ వార్డు మహిళలు స్పష్టం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయకుమార్, వార్డు అధ్యక్షుడు కె వి బాబాతో కలసి మునసబు వారి వీధిలో గడపగడపకు వైయస్ఆర్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను వివరించి ఎంతమేరకు అమలయ్యాయో ప్రజాభిప్రాయం సేకరించారు. డ్వాక్రా రుణాల మాఫీ, తక్కువ వడ్డీకి రుణాలు, అందరికీ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, లేకుంటే రూ.2వేల భృతి, గర్భిణిగా ఉంటే రూ.10వేలు, ఆడపిల్ల పుడితే రూ.25వేలు ఇస్తామనే హామీలను నమ్మి ఓట్లేసి మోసపోయామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజన్న రాజ్యం మళ్లీ రావాలి..
విశాఖ))మా లాంటి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మహానేత వైయస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ..మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ప్రజలు కోరారు. వైయస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ మళ్ల విజయప్రసాద్ పట్టణంలోని 41వ వార్డు పాత ఐటీఐ జంక్షన్ ప్రాంతం తుమ్మడపాలెం, సిద్ధార్ధనగర్, భవానీ గార్డెన్స్ ప్రాంతాలలో గడపగడపలో పర్యటించారు. ప్రజలు సమస్యలు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆయన ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ ప్రచారమే తప్ప సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగడం లేదని వారంతా మండిపడ్డారు.