<span style="text-align:justify">శ్రీకాకుళం: పరిపాలనను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని కొమ్మనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రెడ్డి శాంతి గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతీ ఇంటికి తిరుగుతూ చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక వాగ్ధానాలు ఇచ్చిన బాబు వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే సమస్యలన్నీ శాశ్వత పరిష్కారం అవుతాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. <br/><br/></span>