గుంతకల్లు రూరల్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టనున్న నవరత్నాలతో రాష్ట్రంలో నవశకం ప్రారంభం కానున్నదని వైయస్సార్సీపీ నాయకులు అన్నారు. బుధవారం కసాపురంలో వైయస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తిక్కస్వామి, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి నవరత్నాల పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు స్వచ్ఛందంగా వైయస్సార్ కుటుంబంలో సభ్యులుగా చేరారు. నాయకులు కిసాన్‌సెల్ జిల్లా కార్యదర్శి సోమిరెడ్డి, మండల యువజన్ కన్వీనర్ బెస్త మనోహర్, వైఎస్సార్ విద్యార్థి విభాగం మండల కన్వీనర్ వంశీ యాదవ్,శ్రీరాములు, నాగిరెడ్డి, గణేష్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.
వైయస్సార్ కుటుంబంలో చేరి నవరత్నాల్లో భాగస్వామ్యులు కండికుందుర్పి: వైయస్సార్ కుటుంబంలో చేరి పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల్లో భాగస్వామ్యులు కావాలని మండల వైయస్సార్ సీపీ నాయకులు కోరారు. బుధవారం మండలంలోని మహంతపురం,తెనగల్లు,ఎస్‌మల్లాపురం,ఎనుములదొడ్డి,తూముకుంట గ్రామాల్లో ఆపార్టీ బూత్ కమిటీ కన్వినర్లు నాయకులు కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నవరత్నాల పథకాలపై వివరించి వైయస్సార్ కుటుంబంలో చేర్పించారు. సాయంత్రం నిర్వహించిన కార్యక్రమాల్లో మండల కన్వినర్ సత్యనారాయణశాస్త్రి,రాదాస్వామి,తిప్పేస్వామి,బొమ్మలింగతిమ్మరాజు,గంగాధర,హనుమంతరాయుడు,మంజునాథ్,రాజు,బాబు నరశింహులు,ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.
నల్లమాడలో వైయస్సార్ కుటుంబంనల్లమాడ: మండల కేంద్రం నల్లమాడతో పాటు రెడ్డిపల్లి, వంకరకుంట గ్రామాల్లో బూత్ కమిటీల ఆధ్వర్యంలో బుధవారం వైయస్సార్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి నవరత్నాల కర పత్రాలను పంపిణీ చేసి వాటిగురించి వివరించారు. రెడ్డిపల్లి బూత్ నెంబర్ 124లో 350 ఇళ్లను సందర్శించగా బూత్ కన్వీనర్ టీడీ కేశవరెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, సర్పంచ్ కే.సూర్యనారాయణ, ఉప సర్పంచ్ శ్రీరాములునాయక్, సింగిల్‌విండో ప్రెసిడెంట్ రాజారెడ్డి, యువజన విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి కే.శేషాద్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లమాడలోని 139వ బూత్‌లో 150 ఇళ్లను సందర్శించారు. మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు, బూత్ కన్వీనర్ అన్వర్‌బాషా, సభ్యులు షంషీర్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణానాయక్, హుస్నేన్, షబ్బీర్, నజీర్, మహిళా నాయకురాళ్లు మోదీన్‌బీ, రమణమ్మ పాల్గొన్నారు. వంకరకుంట 122వ బూత్‌లో 120 ఇళ్లను సందర్శించారు. బూత్ కన్వీనర్ ఓబిరెడ్డి, మిలటరీ కుళ్లాయప్ప, చిన్ననాగప్ప, ఈశ్వర్‌రెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.