రుణమాఫీ ఓ మాయ
యలమంచిలి: రుణమాఫీ కలగానే మిగిలిందని, చంద్రబాబు కల్లబొల్లి హామీలతో తాము మోసపోయామని అచ్యుతాపురం మండలం దొప్పెర్ల గ్రామ ప్రజలు వైయస్సార్ సీపీ యలమంచిలి సమన్వయ కర్త ప్రగడ నాగేశ్వరరావు ఎదుట వాపోయారు. గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానికంగా పర్యటించి ప్రజలకు ప్రజాబ్యాలెట్‌ను అందజేశారు. అనంతరం చంద్రబాబు పాలనపై మార్కులు వేయాలని మహిళలను కోరగా... తాము బాబుకు వేసేదీ సున్న మార్కులేనని ఒక్కసారిగా ధ్వజమెత్తారు.
బాబుకు ఓటేసి మోసపోయాం
మండపేట: గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ తాపేశ్వరం గ్రామంలో పర్యటించి అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి గడపలోనూ ప్రజలు చంద్రబాబుకు ఓటు వేసి మేము మోసపోయామని చెబుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వెంకన్నబాబు, కేశవరం ఎంపీటీసీ తుపాకుల ప్రసన్నకుమార్. కేశవరం విద్యాకమిటీ చైర్మన్ మనమర్తి యేసురాజు, అబ్బులు, సత్తిబాబు. శ్రీమన్నారాయణ, కరుణ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్మికుల పట్ల కర్కశం
నరసన్నపేట: రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక కార్మికుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని, వారి హక్కులను కాలరాస్తూ అ భద్రతా భావం పెంచుతోందని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక మేజరు పంచాయతీలోని పెద్దపేటలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.