అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి

దత్తిరాజేరుః జగనన్న వస్తున్నాడు మంచిరోజులు వస్తున్నాయని వైయస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కడుబండి శ్రీనువాసరావు అన్నారు. వి క్రిష్ణాపురంలో పార్టీ నాయకులు మార్పిన సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటికి వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు.  గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజలకు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవిధంగా అందుతున్నాయో అడిగి తెలుసు కొన్నారు. ప్రతి ఒక్కరూ ఏఒక్క సంక్షేమ పథకాలు సక్రమమంగా అంద లేదని నాయకులకు తెలియ చేసారు. జగనన్న పేద మద్య తరగతి ప్రజలను ఆదుకోవడం కోసం ప్రవేశపెట్టిన నవరత్నాలుపై వివరించి నవరత్నాలు స్టిక్కర్లను గోడలకు అట్టించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు ఏ ఒక్క పేదవాడికి పథకాలు అందించడంలో విఫలమయ్యారని అన్నారు. పేద విద్యార్దులకు అమ్మఒడి, పొదుపు మహిళలకు ఆసరా పథకంతో ఎంతో మేలు జరుగు తుందని అన్నారు. పేదవాడికి సంజీవనీ లాంటి ఆరోగ్యశ్రీని ఈప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మరలా జగన్నతోనే రైతులకు ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి సాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. గృహలు పించన్లు వైద్య ఆరోగ్యం గృహలు మంజూరు చేయడం వంటివి అమలు కావాలి అంటే మరలా రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం అవుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షుడు కడుబండి రమేష్‌నాయుడు దత్తిరాజేరు టి భూర్జవలస సర్పంచ్‌లు మహదేవ్‌ ఫణీంద్రుడు పార్టీ నాయకులు చుక్క మురళీ గ్రామ నాయుకులు పాల్గొన్నారు.

Back to Top