వైయస్ఆర్ కుటుంబంలో మమేకమవ్వండి

సుందరపల్లి(కె.గంగవరం): ప్రతి ఒక్కరు వైయస్సార్‌ కుటుంబంలో మమేకమవ్వాలని ఆ పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ కన్వీనర్, ఎంపీపీ పెట్టా శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. మండలంలోని సుందరపల్లి గ్రామంలో బుధవారం వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ బూత్‌ కమిటీ సభ్యులతో కలసి ఆయన ఇంటింటికి వెళ్లి వైయస్సార్‌ కుటుంబంలో చేరాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను ప్రకటించారని సూచించారు. నవరత్నాలతో పేద కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని వారు తెలిపారు. రెడ్డి జయరాజు, మద్దా జగన్నాధం, బద్దా గోవిందరాజు, రాజేష్, రాంబాబు, బూత్‌ కమిటీ సభ్యులు పోలిశెట్టి అర్జున్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
.......................................................
టీడీపీ పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరు
నగరం (మామిడికుదురు): టీడీపీ పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని వైయస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. నగరం గ్రామంలో బుధవారం వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.... రైతులకు, పేదలకు, సమాజంలోని సకల సామాజిక వర్గాల వారికి అండగా ఉండేందుకు నవ్యాంధ్రకు నవరత్నాల పేరిట వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నవంబర్‌ ఆరవ తేదీ నుంచి ప్రజల ముందుకు వస్తున్నారని చెప్పారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్‌ పాదయాత్రను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు ఇంటింటి తిరిగి కరపత్రాలు పంచారు. వైయస్సార్‌ కటుంబంలో పలువురిని సభ్యులుగా చేర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చిట్టూరి రామకృష్ణ, నాయకులు కొమ్మూరి వీరరాఘవరాజు, అన్వర్‌తాహిర్‌ హుస్సేన్, అక్బర్‌ అలీ, మీర్జా అక్బర్‌ హుస్సేన్, మజహర్‌ అలీ, మహ్మద్‌ సేన, చిలకపాటి రాకేష్, మేడిది కిరణ్, వడ్డి వీర్రాజు, యనమదల సత్యనారాయణ, గెడ్డం జగదీష్, కొండేటి స్టాలిన్, కొండేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top