స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పోరాటం

తూర్పు గోదావ‌రి:  కాకినాడ న‌గ‌రంలో నెల‌కొన్న అప‌రిష్కృత స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పోరాటం చేస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌ర కో-ఆర్డినేట‌ర్ ముత్తా శ‌శిధ‌ర్ అన్నారు. కాకినాడ న‌గ‌రంలోని 39వ వార్డులో ముత్తా శ‌శిధ‌ర్ గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కాల‌నీవాసులు ప‌లు స‌మ‌స్య‌లు శ‌శిధ‌ర్ దృష్టికి తెచ్చారు. పారిశుద్ధ్యం, మంచినీటి స‌మ‌స్య‌లు తీవ్రంగా వేధిస్తున్నాయ‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇందుకు స్పందించిన శ‌శిధ‌ర్ స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తామ‌ని, ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి వెళ్లి ప్ర‌జా బ్యాలెట్ పంపిణీ చేశారు. 


Back to Top