శ్రీకాకుళం: రాష్ట్రంలో త్వరలోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పార్టీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలం మదనాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రయ్యపేట; జరాలి; ఎస్‌టీ జరాలి గ్రామాల్లో సాయంత్రం గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ ఇంటింటా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలోని వైఫల్యాలను ఎండగడుతూ..వైయస్ఆర్‌సీపీ పోరాటాలను గుర్తు చేశారు. చంద్రబాబు నిరంకుశ వైఖరిని ప్రతి ఒక్కరు ఖండించాలని, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైయస్ఆర్‌సీపీకి పట్టం కట్టాలన్నారు. రెండేళ్లు ఓపిక పడితే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడే మన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ధర్మాన భరోసా కల్పించారు.