హామీలు మరిచారు
విశాఖ(అరిలోవ): ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చారు. అభివృద్ధి పనులు చేస్తామన్నారు. వృద్దాప్య పింఛన్లు ఇస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు. తీరా అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయారని గాంధీనగర్, శాంతినగర్ కు చెందిన ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆయా కాలనీల్లో పర్యటించి చంద్రబాబు పాలనపై ప్రజలతో మార్కులు వేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు పాలనకు ఒక్కరు కూడా వందకు 10 మార్కులు కూడా వేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖటపట్నం జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ బోని శివరామకృష్ణ, గొలగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నమ్మించి ముంచారు
అక్కయ్యపాలెం: చంద్రబాబు హామీలను నమ్మి ఓట్లేసినందుకు మమ్మల్ని నట్టేట ముంచాడని మహిళలు టీడీపీపై మండిపడుతున్నారు. స్థానిక 34వ వార్డులో వైయస్సార్‌సీపీ నార్త్ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం వైయస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు పైడి రమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు అవినీతి రాజకీయాలను తరిమికొట్టాలని ఈసందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
డ్వాక్రా రుణాల వడ్డీలు కట్టలేకపోతున్నాం
కుందేరు(కంకిపాడు): డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ అంతామాయగా ఉందని పలువురు కుందేరు గ్రామస్తులు వాపోయారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో కంకిపాడు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మీ మాట్లాడుతూ... డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో గ్రూపునకు రూ. 30వేలు వేశారని, అవి తీసుకోవటానికి వీలు లేక పోగా, వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడ్డామని వాపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
మంగళహారతులతో స్వాగతం
అనకాపల్లి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి ప్రజలు మంగళహరతులతో నీరాజనం పడుతున్నారు. అనకాపల్లిలోని 18వ వార్డు గరవపలెంలో వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో గడపగడపకూ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు కరపత్రాలు అందజేసి చంద్రబాబు మోసాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ కార్యకర్తలు జానకీరామరాజు, బుల్లిబాబు, శ్రీనివాస్, సూరిబాబు, రమేష్, జగన్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.