హామీలను పూర్తిగా విస్మరించిన చంద్రబాబు

విజయవాడ: ఎన్నికల ముందు 600లకు పైగా వాగ్ధానాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పూర్తిగా విస్మరించాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 35వ వార్డులో వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించే అర్హత తెలుగుదేశం పార్టీ నేతలకు లేదన్నారు. నమ్మించి ప్రజలచేత ఓట్లు వేయించుకొని వారిని వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో మోసపోయిన ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Back to Top