అమలుకు సాధ్యం కాని హామీలతో మోసం

తూర్పుగోదావరిః రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా  చింతూరు మండలం పోతనపల్లి గ్రామంలో పర్యటించారు.  ప్రతి గడపకు వెళ్లి ప్రజా బ్యాలెట్ పంపిణి చేశారు.  2014 ఎలక్షన్ లో గద్దెనెక్కాలానే దురుద్దేశంతో అమలకు సాధ్యంకాని అనేక హామీలు ఇచ్చి ,గద్దెనెక్కిన తరువాత అవి అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని ఎమ్మెల్యే స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,  స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Back to Top