ప్రజాబ్యాలెట్ లో చంద్రబాబుకు ఓటమి ఖరారైంది. ప్రజల పార్టీ వైయస్సార్సీపీని జనం అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిత్యం పోరాడుతూ ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేస్తున్న ప్రతిపక్ష పార్టీకి గడపగడపలో ఘన స్వాగతం పలుకుతున్నారు. తమ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన వైయస్సార్సీపీ శ్రేణులకు బొట్టు పెట్టి హారతిస్తున్నారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పగిడ్యాల మండలం సంకిరేనిపల్లె, బీరవోలులో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న బాబు అరాచకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అందించిన కరపత్రంలో బాబు పాలనకు సున్నా మార్కులు పడ్డాయి.
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ విజయప్రసాద్ 67 వ వార్డులో ప్రతీ గడపలో పర్యటించారు. బాబు మోసపూరిత పాలనను ఎండగట్టారు. ఈకార్యక్రమంలో జీవన్ శంకర్, కోనపల్లి సతీష్, డానియల్, పింకి జ్యోతి, వాసు అప్పారావు, నాగరాజు, ఇతరులు పాల్గొన్నారు.